|
ఐఐఎం విద్యార్థికి రూ. కోటి 60 లక్షల జీతం March 10, 2010 భారతీయ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రపంచ స్థాయి
కంపెనీలను ఇట్టే ఆకర్షిస్తున్నారు. వారికోసం ఆ కంపెనీలు కూడా పోటీపడుతున్నాయి.
అందుకు ఐఐఎం-కోల్‌కతా విద్యార్థి ఎంపికే నిదర్శనం. ఏడాదికి రూ. 1.6కోట్లు జీతం
అందుకోనున్నవాడిగా అతడు రికార్డు సృష్టించాడు. ఆగ్నేయాసియాలోని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్
బ్యాంక్ ఇంత పెద్ద మొత్తంలో అతడికి చెల్లించేందుకు ముందుకు వచ్చింది. లండన్‌కు
చెందిన బ్యాంకులు కూడా మరో ఇద్దరు విద్యార్థులకు రూ. 1కోటి వార్షిక జీతానికి ఎంపిక
చేసుకున్నాయి. రెండు రోజులుగా జరిగిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఈ ఏడాది 91మంది
ఐఐఎం-కలకత్తా విద్యార్థులను పేరుగాంచిన ప్రముఖ ప్రపంచ స్థాయి కంపెనీలు భర్తీ
చేసుకున్నాయి.
|