|
చంద్రబాబు నన్ను అవమానించారు : జయప్రద February 4, 2010 టీడీపీ అధినేత చంద్రబాబు తనను అవమానించారని, అందుకే ఉత్తరాది
వెళ్లానని సమాజ్‌వాది బహిష్కృత నాయకురాలు జయప్రద వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో
నెలకొన్న పరిస్థితులపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ కృష్ణకమిటీని ముందే ఏర్పాటు
చేసుంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తేవి కావని, అర్థరాత్రి ప్రకటనలు చేస్తే
ఇలాగేఉంటుందని ఆమె విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే ఈ అంశంపై
స్పందిస్తానని జయప్రద చెప్పారు.
|