|
తెలంగాణపై కమిటీ ఏర్పాటు February 3, 2010 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో
కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఐదుగురు
సభ్యులతో తెలంగాణ కమిటీ ఏర్పాటును కేంద్రం బుధవారం ఉదయం ఖరారు చేసింది. జస్టిస్
శ్రీకృష్ణ నేతృత్వంలో ఈ కమిటీలో న్యాయ, ఆర్థిక నిపుణులు ప్రస్తుత రాష్ట్రంలోని అన్ని
వర్గాల అభిప్రాయాలను పరిగణనలో తీసుకోనుంది.
ఈ కమిటీలో సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్డి శ్రీకృష్ణ, నేషనల్ లా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్
రణ్‌బీర్ సింగ్, సీనియర్ రిసెర్చ్ ఫెలో అబూసలే షరీఫ్, ఐఐటీ ప్రొఫెసర్ రవీందర్
కౌర్, హోంశాఖ మాజీ కార్యదర్శి వినోద్ దుగ్గల్‌లు ఉన్నారు.
|