|
జై తెలంగాణ అన్ననటుడు సునీల్ February 3, 2010 హాస్య నటుడు సునీల్ చేత తెలంగాణ ఆందోళనకారులు జై తెలంగాణ
అనిపించారు. జై తెలంగాణ అనే దాకా ఆయనను వారు వదిలిపెట్టలేదు. ఈ సంఘటన మంగళవారం
రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. వికారాబాద్
రైల్వే స్టేషనులో మర్యాద రామన్న షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న తెలంగాణ
ఆందోళనకారులు అక్కడికి చేరుకున్నారు. షూటింగ్ ను అడ్డుకున్నారు. సునీల్ ను
చుట్టుముట్టి జై తెలంగాణ అనిపించారు. సునీల్ నటిస్తున్న మర్యాద రామన్న చిత్రానికి
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇలాంటి అడ్డంకులపై సినీ పరిశ్రమ నుంచి విమర్శలు
వస్తున్నాయి.
|